నిర్మాతగా మారిన యంగ్‌ హీరో.. తండ్రితో తొలి సినిమా!

29 Apr, 2021 11:24 IST|Sakshi

ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు కుమారుడు, యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ కొత్త జర్నీని మొదలుపెట్టబోతున్నాడు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఆయన నటనకి కాస్త విరామం ఇచ్చి నిర్మాతగా రాణించాలనుకుంటున్నాడు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మించబోతున్నాడు. తన తొలి సినిమాకి తండ్రి ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించబోతున్నారట.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి 7 డేస్… 6 నైట్స్ టైటిల్ ఫిక్స్ చేశారట. కాగా, నిర్మాత ఎంఎస్‌ రాజు ఇటీవల 'డర్టీ హరి' సినిమాతో దర్శకుడిగా మంచి హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అందించిన స‌క్సెస్ జోష్‌తోనే కొడుకు నిర్మాణ సంస్థలో కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. తర్వలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నట్లు సమాచారం.

ఇక సుమంత్‌ విషయానికి వస్తే.. తూనీగ తూనీగ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కేరింత, కొలంబస్, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథ చిత్రం 2 చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. 

మరిన్ని వార్తలు