తెరపైకి జాక్సన్‌ జీవితం

2 Feb, 2023 03:33 IST|Sakshi

పాప్‌ సంగీత సామ్రాజ్యానికి రాజుగా వెలిగిన మైఖేల్‌ జాక్సన్‌ జీవితంతో ‘మైఖేల్‌’ పేరుతో బయోపిక్‌ రూపొందనుంది. ఈ చిత్రానికి  ఆంటోయిన్‌ ఫుక్వా దర్శకుడు. మైఖేల్‌గా ఆయన సోదరుడు జెర్మైన్‌ కుమారుడు జాఫర్‌ జాక్సన్‌ నటించనున్నారు. వెండితెరపై యాక్టర్‌గా జాఫర్‌కు ఇదే తొలి చిత్రం.

‘‘మా అంకుల్‌ కథలో నటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు జాఫర్‌. ‘‘మైఖేల్‌ జాక్సన్‌ లక్షణాలు జాఫర్‌లో చాలా ఉన్నాయి. మైఖేల్‌గా నటించగల ఒకే ఒక్క వ్యక్తి జాఫర్‌ అని నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన గ్రాహం. ఇక 1958 ఆగస్టు 29న పుట్టిన మైఖేల్‌ జాక్సన్‌ 2009 జూన్‌ 25న మరణించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు