అనాథ చిన్నారులకు చేయూత..

24 Mar, 2023 05:56 IST|Sakshi

తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు అనాథ చిన్నారుల దీనగాథపై 2021, జనవరి 7న ‘అయ్యో పాపం’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితంకాగా.. దాతలు ఆదుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండల కేంద్రం శివారు బడితండాకు చెందిన బానోత్‌ లత, ఆశీష్‌లు అనారోగ్యంతో చనిపోగా, వారి పిల్లలు చరణ్‌, కుమార్తెలు శ్రద్ధ, సమృద్ధిలు అనాథలయ్యారు. సగంలో ఉన్న ఇంట్లోనే బతుకుతున్నారు. వారి దుర్భర జీవనంపై సాక్షి ప్రచురించిన కథనం పలువురిని కదిలించింది. దాతలు ముందుకొచ్చి ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. పిల్లలకు అవసరమైన వస్తువులు అందించారు. పూర్తయిన ఇంటిని అప్పటి మహబూబాబాద్‌ కలెక్టర్‌ గౌతమ్‌, పిల్లలతో కలిసి 2021, ఏప్రిల్‌ 7న గృహప్రవేశం చేశారు. అనాథ పిల్లలకు అండగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ‘సాక్షి’ దినపత్రికకు బడితండావాసులు, అధికారులు, దాతలు కృతజ్ఞతలు తెలిపారు.

‘సాక్షి’ మేలు మరువలేం..

అమ్మానాన్నలు చనిపోయినప్పుడు మాకు ఎంతో బాధకలిగింది. ఆ తర్వాత బడి బంద్‌ కావడంతో మధ్యాహ్న భోజనం లేక ఇబ్బందులు పడ్డాం. ఇల్లు సరిగా లేక వర్షం పడినప్పుడల్లా నిద్రపట్టక గోస పడ్డాం. కానీ మా బాధను ‘సాక్షి’ పేపర్‌లో రాయడం వల్ల అధికారులు, దాతలు వచ్చి సాయం చేశారు. సాక్షి పత్రిక మాకు చేసిన మేలు ఎన్నడూ మరువలేం.

– చరణ్‌, శ్రద్ధ, సమృద్ధి

మరిన్ని వార్తలు