కానిస్టేబుల్‌ బైక్‌ను ఢీకొట్టిన కారు! అంత‌లోనే ఇలా..

15 Dec, 2023 01:04 IST|Sakshi
శ్రీకాంత్‌ (ఫైల్‌)

నల్లగొండ: బైక్‌పై వెళ్తున్న కానిస్టేబుల్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి సమీపంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప గ్రామ పంచాయతీకి చెందిన శ్రీకాంత్‌ నల్లగొండ పరిధిలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య దుర్గాదేవి, ఏడాది లోపు వయసున్న కుమార్తె ఉంది.

గురువారం శ్రీకాంత్‌ పని మీద బెటాలియన్‌ నుంచి నల్లగొండ టౌన్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో చర్లపల్లి సమీపంలోకి రాగానే వెనుక నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ రూరల్‌ ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. శ్రీకాంత్‌ భౌతికకాయానికి పోలీసు అధికారులు నివాళులర్పించారు.

>
మరిన్ని వార్తలు