-

కరోనా ఉధృతి: 6వ రోజూ 3 వేలకు పైగా మరణాలు

3 May, 2021 10:51 IST|Sakshi

కొనసాగుతున్న కరోనా ఉధృతి

గత 10 రోజులుగా రోజూ మూడు లక్షలకు పైగా కేసులు

స్వలంగా తగ్గిన కొత్త కేసుల నమోదు

3 వేలకు పైగా మరణాలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతోంది. వరుసగా 6వ రోజు కూడా 3వేలకు పైగామరణాలు నమోదయ్యాయి. కొత్త పాజిటివ్‌ కేసుల నమోదు గడిచిన 24 గంటల్లో  3,68,147 కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,99,25,604గా ఉండగా, 3,417 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 2,18,959కి చేరింది.  1,62,93,003 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,13,642 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో, 15,04,698 కోవిడ్ పరీక్షలు జరిగాయి, అంతకుముందు రోజు చేసిన 18,04,954 పరీక్షల కంటే చాలా తక్కువ.

దేశంలో 10 రోజులకు పైగా రోజూ మూడు లక్షలకు పైగా కేసులను నమోదయ్యాయి. దేశంలో రోజువారీ కేసులకు సంబంధించి 4 లక్షల కేసులతో  ఆదివారం ప్రపంచ రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం. కొత్త కేసుల నమోదు కాస్త తగ్గుముఖం పట్టడం విశేషం.  ఇప్పటికే ఢిల్లీ ,మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, హరియాణా, ఒడిసా,పంజాబ్ రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలు దీనికి కారణంగా భావిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా విల‌య‌ం కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో  కొత్త‌గా 5,695 పాజిటివ్ న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,56,485కి చేరింది. నిన్న ఒక్క రోజే 49 మంది కరోనా వైరస్‌తో  ప్రాణాలొదిలారు. దీంతో మొత్తం  సంఖ్య 24,17కి చేరింది. అయితే తాజాగా  6,206 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 3,73,933కి చేరడం గమనార్హం.

మరిన్ని వార్తలు