దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

29 Sep, 2020 10:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 70,589 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  61 లక్షల 45 వేలకు చేరింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా మొత్తం 776  మంది మృతి చెందగా.. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 84,877 డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 96,318 మృతి చెందగా.. మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 51,01,397కి పెరిగింది. దేశ వ్యాప్తంగా  9,47,576యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 83.01 శాతంగా నమోదైంది.  ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 15.42  శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 11,42,811 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు చేసిన పరీక్షల సంఖ్య  7,31,10,041. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేసింది. (కోవిడ్‌ చికిత్సలో టీకోప్లానిన్‌ అద్భుతం!)

మరిన్ని వార్తలు