పాక్​ నుంచి భారత్​ తిరిగొచ్చిన అంజూ ఎక్కడుంది?

1 Dec, 2023 09:37 IST|Sakshi

ప్రియుడి కోసం పాకిస్థాన్​ వెళ్లిన  మహిళ అంజూ.. మరోసారి వార్తల్లో నిలించింది. ఫేస్​బుక్​ ప్రేమికుడు నస్రుల్లాను పెళ్లాండేందుకు.. ఇండియాలోని భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి పాక్​కు వెళ్లిపోయిన ఆమె.. ఇటీవల మళ్లీ తిరిగి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అంజూ  ఇండియాలో ఎక్కడుందో ఎవరికి తెలియరాలేదు. ఈ వారమే అంజూ పాక్​నుంచి ఢిల్లీ తిరిగి రాగా.. ఆమె రాజస్థాన్​లోని భివాడికి వెళ్లలేదు. తన పిల్లలను కలవలేదు.

అంజూ ఆచూకీని అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. అయితే భివాడిలోని ఆమె అంతకముందు నివసించే రెసిడెన్షియల్ సొసైటీ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని వాహనాలను, అపరిచిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. ఇంటలిజెన్స్ బ్యూరోకి చెందిన బృందం అంజు పిల్లలను ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా రెసిడెన్షియల్​ సొసైటీలో ఉంటున్న ఆమె పిల్లల కూడా తమ తల్లిని కలవబోమని చెబుతున్నారు. 

కాగా మధ్యప్రదేశ్​కు చెందిన అంజూకి ఇదివరకే పెళ్లైంది. ఆమెకు 15ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. 2019లో ఫేస్​బుక్​ ద్వారా నస్రుల్లా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.  అనంతరం ఇద్దరు ప్రేమించుకున్నారు. జైపూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి.. గత జులైలో ప్రియుని కోసం పాకిస్థాన్​ వెళ్లింది. అక్కడ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వివాహం తరువాత తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. ఖైబర్​ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్​ దిర్​ జిల్లాలోని ఓ గ్రామంలో వారు నివసిస్తున్నారు.

ఈ జంటకు పాక్​కు చెందిన రియల్​ ఎస్టేట్​ సంస్థ యాజమాని మోహసీన్​ ఖాన్​ అబ్బాసీ కొంత భూమి, నగదును బహుమతిగా అందించారు. నాలుగు నెలల తర్వాత  తాజాగా ఆమె మళ్లీ భారత్​కు తిరిగి వచ్చింది. పాకిస్తాన్, పంజాబ్ సరిహద్దులోని వాఘా బోర్డర్ ద్వారా భారత్లోకి ఆమె బుధవారం రాత్రి ప్రవేశించింది. తన పిల్లలను తీసుకెళ్లేందుకే ఇండియా వచ్చానని ఆమె చెప్పింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్​గా మారాయి. 

మరిన్ని వార్తలు