పోరాడి ఓడిన సైనిక శునకం.. ఆర్మీ అధికారుల నివాళులు

14 Oct, 2022 14:27 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌ జిల్లాలోని టాంగ్‌పావా ప్రాంతంలో ఉగ్రవాదుల సర్చ్‌ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన జూమ్‌ అనే వీర శునకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉగ్రవాదులను చేజ్‌ చేసే ఆపరేషన్‌లో రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయినా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీంతో వెంటనే అధికారులు జూమ్‌(కుక్క)ని హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించి తగిన చికిత్స అందించారు.

ఐతే ఈ ఘటనలో జుమ్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి ప్రాణాలతో పోరాడుతూ... గురువారం ఉదయం 11. 50 నిమిషాలకు మృతి చెందిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జూమ్‌కి శ్రీనగర్‌లోని చినార్‌ వార్‌ మెమోరియల్‌ బాదామి బాగ్‌ కంటోన్మెంట్‌ వద్ద భారత సైన్య ఘనంగా నివాళులర్పించినట్లు పీఆర్‌ఓ డిఫెన్స్‌ కల్నల్‌ ఎమ్రాన్‌ ముసావి  తెలిపారు.

అంతేగాదు ఈ కార్యక్రమంలో పలు ఆర్మీ శునకాలు పాల్గొని మృతి చెందిన వీర శునకం జూమ్‌కి నివాళులర్పించాయి. ఆర్మీ కనైన్ చినార్ వారియర్స్‌లో అమూల్యమైన సభ్యుడిని కోల్పాయమని కల్నల్‌ ముసావి అన్నారు. జూమ్‌ పలు ఉగ్రవాదక నిరోధక కార్యకలాపాల్లో వీరోచితంగా పోరాడి ధైర్యసాహసాలను కనబర్చినట్లు తెలిపారు.

(చదవండి: మాస్కో విమానంలో బాంబు కలకలం...అప్రమత్తమైన అధికారులు)

మరిన్ని వార్తలు