తొలి మహిళా న్యాయవాది కార్నేలియా సొరాబ్జీ గురించి ఈ విషయాలు తెలుసా?

6 Jul, 2022 14:27 IST|Sakshi

కార్నేలియా సొరాబ్జీ.. భారతదేశంలో మొదటి మహిళా న్యాయవాది. అలహాబాదు హైకోర్టులో పని చేశారు. సొరాబ్జీ బొంబాయి విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైన తొలి మహిళ కూడా. అంతేకాదు, ఆక్స్‌ఫర్డు విశ్వ విద్యాలయం నుండి న్యాయశాస్త్రం అభ్యసించిన తొలి (1889)భారతీయురాలు. 2012లో ఆమె ప్రతిమను లండన్‌ లోని ‘లింకన్‌ ఇన్‌‘లో ఆవిష్కరించారు. సొరాబ్జీ  సామాజిక సంస్కరణలలో చురుగ్గా పాల్గొన్నారు.

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ ఇండియా, ఫెడరేషన్‌ ఆఫ్‌ యూనివర్శిటీ ఉమెన్, బెంగాల్‌ లీగ్‌ ఆఫ్‌ సోషల్‌ సర్వీస్‌ ఫర్‌ ఉమెన్‌ వంటి మహిళాభ్యున్నతి సంస్థలతో కలిసి పనిచేశారు. దేశానికి ఆమె చేసిన సేవలకు 1909లో కైసర్‌–ఇ–హింద్‌ బంగారు పతకం లభించింది. తన కెరీర్‌ ప్రారంభంలో సొరాబ్జీ మహిళల స్వయం పాలన కోసం కృషి చేయడం స్వాతంత్య్రోద్య మానికి ప్రచార బలాన్నిచ్చింది.

అయితే 1920ల చివరి నాటికి, సోరాబ్జీ బలమైన దేశ వ్యతిరేక వైఖరిని అవలంబిం చారన్న విమర్శ ఉంది. దేశ హిందూ ‘సనాతన ధర్మం’ నమ్మ కాలు, ఆచారాలు, సంప్రదాయాలను జాతీయవాదం ఉల్లం ఘించిందని ఆమె నమ్మిన మాటైతే వాస్తవం అంటారు. నేడు సొరాబ్జీ  వర్ధంతి. 1954 జూలై 6న తన 87 ఏళ్ల వయసులో ఆమె మరణించారు.

మరిన్ని వార్తలు