Bengaluru Traffic Police: ట్రాఫిక్‌ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే

21 Mar, 2022 06:56 IST|Sakshi

సాక్షి,బళ్లారి: డ్రైవర్‌ లైసెన్స్, ఇన్సూరెన్స్‌ సక్రమంగా ఉన్నాయా లేదా, వాహన డ్రైవర్లు రోడ్డు నియమాలు పాటిస్తున్నారా లేదా అన్న దానిపై నిత్యం ట్రాఫిక్‌ పోలీసులు నిఘా ఉంచి, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవడం, అపరాధ రుసుం వసూలు చేయడం పరిపాటి. అయితే అన్ని సక్రమంగా ఉన్నప్పటికి బళ్లారిలో కొందరు ట్రాఫిక్‌ పోలీసులు ఏదో ఒక తప్పు చూపి వాహనాలు నడిపే వారితో డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ సంబంధించిన వాహనాలు కనబడితే మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. (చదవండి: సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్‌...పంజాబ్‌ ఆప్‌ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు )

ఏపీ నుంచి బళ్లారికి వచ్చే వాహనాలను ఆపడంతో ఎంతో కొంత డబ్బులు తీసుకుని వాహనాలు వదులుతున్నారని, డ్రైవర్లు, వాహన యజమానుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బళ్లారికి అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో వచ్చి పోతుంటారు. బళ్లారి ఏపీఎంసీ మార్కెట్‌లో పండ్లు, కూరగాయాలు, ఆహార ధాన్యాలు అమ్మకాల సాగించేందుకు ఇక్కడికి వాహనాల్లో వస్తుంటారు. రైతులు తీసుకుని వచ్చిన వాహనాలను సైతం అన్ని రకాలు సక్రమంగా ఉన్నప్పటికి తనిఖీలు చేస్తూ డబ్బులు తీసుకుంటున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఇక నగరంలోని ప్రధాన రహదాల్లో ఏపీ వాహనాలు కనబడితే చాలు ఆపి ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు. 


 

మరిన్ని వార్తలు