Subrata Roy Death: సుబ్రతా రాయ్‌కు అమితాబ్‌తో దోస్తీ ఎలా కుదిరింది?

15 Nov, 2023 08:37 IST|Sakshi

సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ మంగళవారం అర్థరాత్రి కార్డియోస్పిరేటరీ అరెస్ట్ కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో మరణించారు. 75 ఏళ్ల వయసులో ఆయన ప్రపంచానికి వీడ్కోలు పలికారు. భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన సుబ్రతా రాయ్ విభిన్న వ్యాపార ప్రయోజనాలతో కూడిన సహారా ఇండియాను నెలకొల్పారు. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.  

సుబ్రతా రాయ్‌ను ‘సహారాశ్రీ’ అని కూడా పిలుస్తుంటారు. ఆయనకు బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్ బచ్చన్‌తో విడదీయరాని స్నేహం ఉందని చెబుతారు. అమితాబ్ బచ్చన్ వ్యాపారంలో నష్టాల్లో కూరుకుపోయినప్పుడు సుబ్రతా రాయ్ ‘బిగ్‌బీ’కి  సహాయం అందించారు. వీరి స్నేహం ఇక్కడి నుంచే మొదలైంది. వీరిద్దరినీ  సమాజ్‌వాదీ పార్టీ దివంగత నేత అమర్ సింగ్ దగ్గర చేశారని చెబుతారు. ఈ ముగ్గురూ మంచి స్నేహితులుగా మెలిగారు. దీనికి గుర్తుగా పలు ఫొటోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తాయి. 

సుబ్రతా రాయ్ సహారా మేనకోడలు శివాంక వివాహం 2010లో జరిగింది. ఈ వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమయంలో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ సుబ్రతా రాయ్ సహారా కలిసి కనిపించారు. ఇప్పుడు సుబ్రతా రాయ్ సహారా మన మధ్య లేరు. బుధవారం(నేడు)లక్నోలో సుబ్రతా రాయ్ సహారా అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి:  సుబ్రతా రాయ్ కుటుంబం విదేశాల్లో ఎందుకు ఉంటోంది?

మరిన్ని వార్తలు