సుప్రీంలో తేలాకే ఎస్టీ రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ చేస్తాం: కేంద్రం

12 Dec, 2022 14:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 10% బీసీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపారా అని టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి లోక్‌సభలో  కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘తెలంగాణాలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందింది. తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు 2017లో హోంశాఖకు చేరింది. కానీ ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఈ రిజర్వేషన్ల కేసు పెండింగ్‌లో ఉంది.

అందువల్ల అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసు ఏ విషయమనేది తేలాక.. ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33ను ఆఘా మేఘాలపై జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే గత పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా.. తెలంగాణ జారీ చేసిన రిజర్వేషన్ల పెంపు బిల్లు విషయమై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.

(చదవండి: ఈడీ ఎదుట విచారణకు హజరైన మంత్రి తలసాని పీఏ అశోక్‌)

మరిన్ని వార్తలు