National Herald Case: ముగిసిన అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ఈడీ విచారణ..

23 Nov, 2022 14:56 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్‌ కేసు మరోసారి తెర మీదికి వచ్చింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరయ్యారు. యంగ్‌ ఇండియాకు ఇచ్చిన విరాళాలపై అంజన్‌ కుమర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు రెండున్నర గంటలపాటు అంజన్‌ కుమార్‌ను విచారించిన ఈడీ.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. యంగ్ ఇండియన్‌ ఫౌండేషన్‌ అనే ఛారిటీ సంస్థకు గతంలో అంజన్ కుమార్ యాదవ్ రూ. 20 లక్షలు డొనేషన్ ఇచ్చారు.

విచారణ అనంతరం అంజన్‌ కమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ..  రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని ఈడి అధికారులకు తెలిపినట్లు చెప్పారు. సంస్థ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉందనే స్వచ్చందంగా విరాళాలు ఇచ్చానన్నారు.  కక్ష సాధింపు చర్యలో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ నేతలను విచారిస్తుందని విమర్శించారు. మళ్ళీ విచారణ ఉంటే పిలుస్తామని అధికారులు చెప్పినట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రశ్నించిన విషయం తెలిసిందే. 
చదవండి: మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్‌ రావు

మరిన్ని వార్తలు