కరోనా బీభత్సం.. 1.59 లక్షలు దాటిన కేసులు

9 Jan, 2022 10:09 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. కరోనా థర్డ్‌వేవ్‌ మరింత వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటలలో 1,59,632 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో మహమ్మారి బారిన పడి 327 మంది మృతి చెందారు. అదే విధంగా, 40,863 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కోవిడ్‌ పాజిటీవిటీ రేటు 10.21 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 5,90,611 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది.

ఇక మరోవైపు ఒమిక్రాన్‌ కూడా బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే 27 రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 3,623 కు పెరిగింది. ప్రస్తుతం అత్యధికంగా మహరాష్ట్రలో  1,009 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా 1,490 మంది ఒమిక్రాన్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది. 

చదవండి: రైల్వేస్టేషన్లలో అదనపు బాదుడుకు ప్లాన్‌! రైలెక్కినా దిగినా రూ.10 నుంచి 50?

మరిన్ని వార్తలు