కరోనా రెండు దశ: కొత్తగా 2,95,041 పాజిటివ్‌ కేసులు

21 Apr, 2021 11:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌తో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశంలో మూడు లక్షలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 2,95,041 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 2,023 మంది బాధితులు మృతి చెందారు. 1,67,457 మంది కరోనా బాధితులు కోలుకొని పలు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

దేశంలో కరోనా యాక్టివ్‌ కేసులు 21లక్షలు దాటాయి. దేశంలో ప్రస్తుతం 21,57,538 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,56,16,130 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 1,32,76,039 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 1,82,553 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 13,01,19,310 మందికి కరోనా వైరస్‌ టీకాలు అందించారు.

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 6,542 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24గంటల్లో 20మంది కరోనా బాధితులు మృతి చెందారు. కరోనా నుంచి 2,887మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 46,488 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 898 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
చదవండి: కోవిడ్‌ వారియర్స్‌కు భారీ ఊరట

మరిన్ని వార్తలు