అత్యధికంగా 69,878 పాజిటివ్‌, 945 మరణాలు

22 Aug, 2020 09:41 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో గడచిన 24 గంటల్లో 69,878 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 945 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 55,794 కు చేరింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,75,702 కు చేరింది. దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్‌ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో 63,631మంది వైరస్‌ బాధితులు కోలుకున్నారు. దీంతో వైరస్‌ను జయించిన వారి మొత్తం సంఖ్య 22,22,578 కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 74.30 శాతం, మరణాల రేటు 1.89 శాతంగా ఉందని తెలిపింది. ఇదిలాఉండగా.. భారత్‌లో ఇప్పటివరకు 3.44 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయిని భారత్ వైద్య విద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. రోజూ 10 లక్షల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని తెలిపింది.


(చదవండి: కరోనా కట్టడి : బీసీజీ టీకాపై అధ్యయనం)

>
మరిన్ని వార్తలు