భారత్‌లో కొత్తగా 78,524 పాజిటివ్‌ కేసులు

8 Oct, 2020 10:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో కోవిక్‌-19 కేసుల సంఖ్య 68 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 78,524 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 68,35,656కి పెరిగింది. ఒకే రోజులో కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా 971 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 83,011 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రులను నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం కరోనా నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 58, 27,704కు చేరింది. ఇప్పటివరకు దేశంలో 9,02,425 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇక కరోనా కారణంగా ఇప్పటివరకు మృతి చెందినవారి మొత్తం సంఖ్య 1,05,526గా ఉంది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 85.25 శాతంగా ఉంది. నమోదయిన మొత్తం కరోనా  కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 13.20 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు1.54 శాతానికి తగ్గింది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 11,94,321 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. దేశంలో ఇప్పటి వరకు 8,34,65,975 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. (చదవండి: కరోనా: ఎక్మో చికిత్సతో పునర్జన్మ)

మరిన్ని వార్తలు