చైనా ముప్పు; భారత్‌- జపాన్‌ కీలక ఒప్పందం

8 Oct, 2020 10:28 IST|Sakshi

ఇండో– జపాన్‌ విదేశాంగ మంత్రుల వ్యూహాత్మక చర్చలు

5జీ, ఏఐపై ఇండియా- జపాన్‌ ఒప్పందం

న్యూఢిల్లీ: 5జీ సాంకేతికత, కృత్రిమ మేధ, ఇతర కీలక అంశాల్లో పరస్పర సహకారానికి సంబంధించి భారత్, జపాన్‌ల మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. అలాగే, ఇండో పసిఫిక్‌ ఓషియన్‌ ఇనిషియేటివ్‌(ఐపీఓఐ)’కు నాయకత్వం వహించేందుకు జపాన్‌ అంగీకరించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జపాన్‌ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మొటెగిల మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయించారు. సురక్షిత, స్వేచ్ఛాయుత ఇండో– పసిఫిక్‌ ప్రాంతం లక్ష్యంగా భారత్‌ చొరవతో ఈ ఐపీఓఐ ఏర్పడింది. ఈ ప్రాంతంలో చైనా మిలటరీ మౌలిక వసతులు పెంచుకుంటున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇండో– జపాన్‌ విదేశాంగ మంత్రుల వ్యూహాత్మక చర్చలు ఫలప్రదంగా సాగాయని జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. తీర ప్రాంత రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఐరాసలో సంస్కరణలు తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి ఇరువురు నేతలు చర్చలు జరిపారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. డిజిటల్‌ టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో.. దృఢమైన సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థను రూపొందించుకునే దిశగా రెండు దేశాల మధ్య సైబర్‌ సెక్యూరిటీ ఒప్పందం కుదిరిందని పేర్కొంది. (చదవండి: ‘హెచ్‌1బీ’పై మరిన్ని ఆంక్షలు)

మరిన్ని వార్తలు