కరోనా మళ్లీ ఉగ్రరూపం.. దేశంలో కొత్తగా 90వేలపైగా కేసులు

6 Jan, 2022 11:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ  విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య రోజురోజుగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 90,928  కరోనా పాజిటివ్‌ నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

అదే విధంగా గడిచిన 24 గంటల్లో 325 మంది కరోనాతో మరణించగా, 19,206 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరొకవైపు కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దేశంలో ఇప్పటివరకు 2,630 కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్‌ కేసులు పెరగడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

చదవండి: ఒమిక్రాన్‌ మిగతా వాటిలా కాదు.. శ్వాస వ్యవస్థ పైభాగంలో ఎఫెక్ట్‌ ఉంటుంది: డబ్ల్యూహెచ్‌వో 

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,43,41,009 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బరినపడి 4,82,876   మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,85,401 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ రోజువారి పాజిటివ్ రేటు  6.43 శాతంగా ఉంది. డిసెంబర్‌ 28న దాదాపు 9 వేలకు పైగా కేసులు నమోదుకాగా,  గడిచిన 24 గంటల్లో 90 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు