కరోనా కల్లోలం: ఒక్కరోజే 1501 మంది మృతి

18 Apr, 2021 12:22 IST|Sakshi

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

కొత్తగా 2,61,500 కరోనా కేసులు, 1,501 మరణాలు

సాక్షి, ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. సెకండ్‌ వేవ్‌ కరోనా‌ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో వరుసగా నాలుగో రోజు కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,47,88,109 కి చేరింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 1,501 మంది  మృతి  చెందారు.

గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,38,423  మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 1,28,09,643 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వల్ల దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 1,77,150కి చేరింది. దేశంలో ప్రస్తుతం 18,01,316 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 87.23 శాతం కాగా, మరణాల రేటు 1.21 శాతం ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 15,66,394 కరోనా  నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా  26,84,956 మంది కరోనా వాక్సిన్ తీసుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 12,26,22,590 మందికి వ్యాక్సినేషన్ జరిగింది.
చదవండి:
రెమిడెసివిర్‌ ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
పదునెక్కిన కరోనా కోరలు

మరిన్ని వార్తలు