కరోనాతో ఊపిరి సమస్యలే కాదు.. మరో పెనుముప్పు కూడా!

8 May, 2021 03:08 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ వైరస్‌ ప్రధానంగా గురిపెట్టేది ఊపిరితిత్తుల పైనేనని, దీనివల్ల శ్వాస సంబంధ సమస్యలొస్తాయని, ఊపిరాడక మరణాలు సంభవిస్తున్నాయని ఇప్పటిదాకా భావిస్తున్నాం. నిజానికి కరోనా వైరస్‌ సోకితే కేవలం ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాదు, శరీరంలో రక్తం గడ్డకడుతుందని, కొందరిలో ఇది ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవయవాలను కాపాడాలంటే రక్తం గడ్డలను తక్షణమే తొలగించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

కరోనా బారినపడి ఆసుపత్రుల్లో చేరిన బాధితుల్లో 14–28 శాతం మందిలో హెచ్చు స్థాయిలో రక్తం గడ్డకట్టినట్లు (డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌–డీవీటీ), 2–5 శాతం మందిలో స్వల్ప స్థాయిలో (ఆర్టీరియల్‌ థ్రాంబోసిస్‌) రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. కరోనాతో ఉపిరితిత్తుల తరహాలోనే రక్త నాళాలు కూడా దెబ్బతింటున్నాయి. ప్రతివారం సగటు ఐదారు కేసులు ఇలాంటివి వస్తున్నాయని ఢిల్లీలోని సర్‌ గంగారాం హాస్పిటల్‌కు చెందిన ఎండోవాస్క్యులర్‌ సర్జన్‌ అంబరీష్‌ సాత్విక్‌ చెప్పారు. టైప్‌–2 డయాబెటీస్‌తో కరోనా బారినపడిన వారిలో ఈ ముప్పు మరింత ఎక్కువ అని ఢిల్లీలోని ఆకాశ్‌ హెల్త్‌కేర్‌ వైద్యుడు అమ్రీష్‌ కుమార్‌ తెలిపారు.  

చదవండి: (చైనాకు కలిసొస్తున్న కరోనా..!) 

(కోవిడ్‌ సంక్షోభం మన స్వయంకృతం)

మరిన్ని వార్తలు