మరో ధర్మాసనానికి జనార్ధన్‌రెడ్డి పిటిషన్‌ బదిలీ

25 May, 2021 10:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బెయిలు షరతులు సడలించాలంటూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. జనార్ధనరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ వెకేషన్‌ బెంచ్‌ జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం ముందుకు సోమవారం వచ్చింది. ఈ పిటిషన్‌ గతంలో జస్టిస్‌ అశోక్‌భూషణ్, జస్టిస్‌ ఆర్‌.సుభాశ్‌రెడ్డిల ధర్మాసనం విచారించిందని, ప్రస్తుతం వెకేషన్‌ బెంచ్‌ ఈ పిటిషన్‌ను విచారించబోదని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ స్పష్టం చేశారు.

బళ్లారి, అనంతపురం, కడపలకు వెళ్లకూడదన్న 20.1.2015 నాటి ఆదేశాల్లోని షరతు సడలించాలని పిటిషన్‌లో కోరారు. జస్టిస్‌ ఆర్‌.సుభాశ్‌రెడ్డితో మాట్లాడామని, గతంలో పిటిషనర్‌ దాఖలు చేసిన మిస్‌లీనియస్‌ అప్లికేషన్‌తోపాటు ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సూచించిన ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది.

మరిన్ని వార్తలు