దేశంలో ఇప్పటివరకు 49 కోట్ల మందికిపైగా వ్యాక్సినేషన్‌: కేంద్రం

1 Aug, 2021 16:57 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 49 కోట్ల మైలు రాయి దాటింది. ఒక్క జులైలోనే 13 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రాలు, యూటీల వద్ద ఇంకా అందుబాటులో 3 కోట్లకుపైగా వ్యాక్సిన్లు నిల్వ ఉన్నట్లు తెలిపింది. దేశంలో కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటి దాకా 3 కోట్లకు పైగా కోలుకున్నట్లు వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు కోలుకున్నవారు 95 శాతం పైనే ఉన్నారని పేర్కొంది.

గత నెల రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కనిపిస్తోంది. తెలంగాణలో 2.2 కోట్ల మంది టీకాలకు అర్హులు ఉండగా, వీరిలో 1.12 కోట్ల మందికి ఇప్పటి వరకు సింగల్‌ డోస్‌ వేయగా, 33.79 లక్షల మందికి రెండు డోస్‌లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు