స్వల్ప దూర అగ్ని–1 ప్రయోగ పరీక్ష సక్సెస్‌

8 Dec, 2023 06:21 IST|Sakshi

బాలాసోర్‌(ఒడిశా): స్వల్ప దూరాలను ఛేదించగల, ప్రయోగ దశలో ఉన్న బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని–1ను విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ శాఖ గురువారం ప్రకటించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ద్వీపంలో ఈ పరీక్షకు వేదికైంది. ‘అగ్ని–1 అద్భుతమైన సత్తా ఉన్న క్షిపణి వ్యవస్థ. ఇప్పుడు దీనిని స్వల్ప దూర లక్ష్యాలకు పరీక్షించి చూస్తున్నాం.

గురువారం నాటి ప్రయోగంలో ఇది అన్ని క్షేత్రస్థాయి, సాంకేతిక పరామితులను అందుకుంది. రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో–ఆప్టికల్‌ సిస్టమ్‌ వంటి అన్ని ట్రాకింగ్‌ వ్యవస్థల ద్వారా దీని పనితీరును పరిశీలించాం. రెండు నౌకల ద్వారా క్షిపణి ఖచి్చతత్వాన్ని పర్యవేక్షించాం. ఇది చక్కగా పనిచేస్తోంది’’ అని రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో చెప్పారు. ఈ రకం క్షిపణిని చివరిసారిగా జూన్‌ ఒకటో తేదీన ఇదే వేదికపై విజయవంతంగా పరీక్షించారు.  

>
మరిన్ని వార్తలు