చెన్నైని వదలని వర్షాలు..మళ్లీ అలర్ట్‌ ఇచ్చిన ఐఎండీ

8 Dec, 2023 08:16 IST|Sakshi

చెన్నై: మిచౌంగ్‌ తుపాను ప్రభావం నుంచి ఇంకా కోలుకోని చెన్నై నగరానికి వాతావరణ శాఖ మరో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. రానున్నఐదు రోజుల్లో చెన్నై, పాండిచ్చేరిలో భారీ వర్షాలు కురవచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. నగరంలో స్కూళ్లు,కాలేజీలు శుక్రవారం కూడా మూసివేయనున్నారు.

మిచౌంగ్‌ తుపాను కారణంగా చెన్నైలో 20 మంది మృత్యువాత పడ్డారు. మిచౌంగ్‌ తుపాను ఏపీలో తీరం దాటినప్పటికీ చెన్నైలోనూ తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికీ కురుస్తున్న వర్షాల వల్ల చెన్నైలో తుపాను సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

ఇతర జిల్లాల నుంచి 9 వేల మంది అధికారులను చెన్నైలో సహాయక చర్యలకుగాను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. చెన్నైతో పాటు నీలగిరి,కోయంబత్తూరు, తిరుప్పూర్‌, దిండిగల్‌, థేనీ,పుదుక్కొట్టై, తంజావూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇదీచదవండి..సహజీవనం ప్రమాదకరమైన జబ్బు

>
మరిన్ని వార్తలు