'శౌర్యం' చూపుతున్న భారత క్షిపణి

3 Oct, 2020 16:46 IST|Sakshi

800 కిలోమీటర్ల లక్ష్యాన్నైనా ఛేదించే సామర్థ్యం 

 సాక్షి, బాలాసోర్‌: గత వారం రోజులుగా డీఆర్‌డీవో వరుస క్షిపణులను  ప్రయోగిస్తోంది.  అధునాతన వర్షన్‌తో శౌర్యా అణు సామర్థ్యం గల బాలిస్టిక్‌ క్షిపణిని డీఆర్‌డీఓ శనివారం విజయవంతంగా పరీక్షించింది.  భారత్‌- చైనా ఎల్‌ఏసీ వద్ద ఉధృత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈ క్షపణిని పరీక్షించడం ప్రాధాన్యం సంతరించికుంది.  ఈ క్షపణి దాదాపు 800 కిలోమీటర్ల మేర లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం కలదు. ఈ క్షిపణి ఆపరేట్‌ చేసేందుకు సులువుగా, తేలిగ్గా ఉంటుందని.. లక్ష్యాన్ని ఛేదించే  క్రమంలో చివరి దశకు చేరుకునే సరికి  హైపర్‌సోనిక్‌ వేగంతో దూసుకెళ్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 

వరుస పరీక్షలతో డీఆర్‌డీవో దూకుడు..
డీఆర్‌డీవో వరుస క్షిపణి పరీక్షలతో దూసుకెళ్తోంది.  'లేజర్‌ గైడెడ్‌ యాంటీ ట్యాంక్‌' క్షిపణిని మంగళవారం విజయవంతంగా పరీక్షించారు.  గత పదిరోజుల వ్యవధిలో రెండో క్షిపణిని పరీక్షించిండం విశేషం.  మహారాష్ర్టలోని అహ్మద్‌నగర్‌లో ఈ క్షిపణిని అభివృధి చేశారు.  దీని రేంజ్‌ ఐదు కి.మి ఉంటుందని.. వివిధ లాంచ్‌ప్యాడ్స్‌‌ ద్వారా ప్రయోగించవచ్చని  రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

బ్రాహ్మోస్‌...
డీఆర్‌డీవో విజయవంతంగా ప్రయోగించిన మరో ఆయుద్ధం.. 'బ్రాహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షపణి'. 400 కి.మి రేంజ్‌తో లక్ష్యాన్ని ఛేదించగల శక్తి బ్రాహ్మోస్‌ ప్రత్యేకం. డీఆర్‌డీవో పీజే​-10 ప్రాజెక్ట్‌ ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు.  ఇటువంటి క్షపణిని పరీక్షించడం ఇది రెండోసారి. 

మరిన్ని వార్తలు