కరోనా రెండో దశ : స్వల్పంగా తగ్గిన పాజిటివ్‌ కేసులు

27 Apr, 2021 11:56 IST|Sakshi

సోమవారంతో పోలిస్తే దేశంలో తగ్గిన కేసులు

తెలంగాణాలో విజృంభణ

సాక్షి, న్యూఢిల్లీ: గతకొన్ని రోజులుగా అడ్డే లేకుండా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి మంగళవారం కాస్త శాంతించినట్టు కనిపిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం సోమవారం నాటి కేసులతో పోలిస్తే  తాజాగా దేశంలో 3,23,144 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే గత 24 గంటల్లోమరణాల సంఖ్య మాత్రం తగ్గలేదు. నిన‍్న ఒక్కరోజే  2771 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,76,36,307కి చేరగా, 1,97,894 మంది మృతి చెందారు అయితే 1,45,56,209 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 28,82,204 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  

తెలంగాణాలో ఆగని ఉధృతి
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం ఒక్కరోజే 10వేలు దాటేశాయి. మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల మధ్య 10,122 మందికి కరోనా బారిన పడ్డారు. కరోనాతో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.   6,446 మంది కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,440, మేడ్చల్‌ 751, రంగారెడ్డిలో 621, వరంగల్ అర్బన్‌ 653, నిజామాబాద్‌లో 498,ఖమ్మం 424, మహబూబ్‌నగర్‌లో 417 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దీంతో   మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,11,905గా ఉండగా, 2094 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో  69,221 యాక్టివ్ కేసులున్నాయి. 

కాగా కరోనా  సెకండ్‌ వేవ్ భారత్‌ను అతలాకుతలం చేస్తోంది. వరుసగా ఆరో రోజుకూడా 3 లక్షలకుపైగా కేసులు, 2వేల మందికి పైగా మరణాలు సంభవిచాయి. మరోవైపు  పలు రాష్ట్రాల్లో  తీవ్రంగా వేధిస్తున్న ఆక్సిజన్ , బెడ్స్‌ కొరత సమస్యలు  బాధితుల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి.

చదవండి: వరుడికి పాజిటివ్‌: అధికారుల బంపర్ ఆఫర్‌ తెలిస్తే..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు