ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు.. ఏప్రిల్‌ 1 వరకు

28 Mar, 2024 16:44 IST|Sakshi

Updates

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు

  • ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు
  • మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీ పొడిగించిన రౌస్‌ అవెన్యూ కోర్టు
  • ఏడు రోజులు ఈడీ కోరినా నాలుగు రోజులే కస్టడీ పొడిగింపు.
  • ఏప్రిల్‌ 1 వరకు కస్టడీలోనే కేజ్రీవాల్‌

సీబీఐ స్పెషల్ కోర్టులో ముగిసిన వాదనలు.

  • కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వు.
  • తీర్పును రిజర్వు చేసిన రౌస్‌ ఎవెన్యూ కోర్టు.
  • మరో ఏడు రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరిన ఈడీ
  • గోవా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించాలన్న దర్యాప్తు సంస్థ

నన్ను అరెస్టు చేయడమే ఈడీ లక్ష్యం : కేజ్రీవాల్ 

  • నిందితుడితో బలవంతంగా నా పేరు చెప్పించారు.
  • నిందితుడు 55 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్  బాండ్స్ బీజేపీకి ఇచ్చారు. 
  • ఏ కోర్టు నన్ను దోషిగా పరిగణించలేదు.
  • నా అరెస్టుకు తగిన ఆధారాలు లేవు.
  • ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీ అని చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
  • నా పార్టీని నిర్మూలించాలనుకుంటున్నారు.
  • నా పేరు కేవలం నాలుగు సార్లు ప్రస్తావనకు వచ్చింది.

ఈడీ వాదనలు:

  •  ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ 100 కోట్ల లంచం తీసుకున్నారు.
  • ఆయన విచారణకు సహకరించడం లేదు.
  • ఈడీకి అరెస్టు చేసే హక్కు ఉంది. 
  • శరత్ చంద్రారెడ్డి 50 కోట్ల రూపాయలు ఎలక్ట్రోలు బాండ్స్ రూపంలో బీజేపీకి ఇచ్చిన నిధులకు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధం లేదు.
  • ఇది క్విడ్ ప్రోకో కిందికి రాదు.
  • ఆమ్ ఆద్మీ పార్టీ హవాలా డబ్బు ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలు మా దగ్గర ఉన్నాయి.
  • వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా వద్ద ఉన్నాయి

కోర్టుకు తీసుకు వెళ్లే సమయంలో కేజ్రీవాల్‌ కీలక వ్యాఖ్యలు

  • నా అరెస్ట్‌ రాజకీయ కుట్ర 
  • ఢిల్లీ ప్రజలే గట్టిగా సమాధానం చెబుతారు
  • రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపర్చిన ఈడీ

ఢిల్లీ:

  • సీబీఐ స్పెషల్ కోర్టు ముందు కేజ్రీవాల్‌ను ప్రవేశపెట్టిన ఈడీ 
  • మరో వారం రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం 
  • కోర్టుకు చేరుకున్న కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపర్చనుంది. ఈడీ కస్టడీ పొడిగింపు కోరుతుందా? లేదంటే రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మనీలాండరింగ్‌ అభియోగాలపై కేజ్రీవాల్‌ను మార్చి 21 ఆయన నివాసంలో ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజు ఆయన్ను ఈడీ రౌస్‌ అవెన్యూ కోర్టుకు హజరుపరిచి కస్టడీకి కోరింది. దీంతో కోర్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపర్చనుంది ఈడీ. ఒకవేళ కస్టడీ పొడగింపునకు కోర్టు అంగీకరించకపోతే మాత్రం ఆయన్ని తీహార్‌ జైలుకు తరలిస్తారు

మరోవైపు తనను ఈడీ చేసిన అరెస్ట్ అక్రమమంటూ సీఎం కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఆయనకు ఊరట లభించలేదు. కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈడీకీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్‌ 2లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఏప్రిల్‌ 3కు  వాయిదా వేసింది. ఇదే కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవితను జ్యుడిషియల్‌ రిమాండ్‌లో భాగంగా తీహార్‌ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

Election 2024

మరిన్ని వార్తలు