ఘనంగా పెంపుడు కుక్క బర్త్‌ డే వేడుక...ఏకంగా 4 వేలమందికి...

26 Jun, 2022 13:43 IST|Sakshi

చాలా మంది తమ పెంపుడు కుక్కల కోసం ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలిచిన పలువురి గురించి విన్నాం. తమ పెంపుడు జంతువులు వినూతనంగా ఉండాలని అందంగా తీర్చిదిద్దడమో లేక ఊహించని విధంగా వాటి పేరు మీద విలువైన ఆస్తులు రాయడం వంటి కథనాలను గురించి విన్నాం. అచ్చం అలానే ఇక్కడొక యజమాని తన కుక్క పుట్టిన రోజు అందరూ గుర్తుంచుకునేలా ఘనంగా సెలబ్రేట్‌ చేశాడు.

వివరాల్లోకెళ్తే...కర్ణాటకలోని బెలగావికి చెందిన శివప్ప ఎల్లప్ప తన పెంపుడు కుక్క పుట్టినరోజును ఘనంగా నిర్వహించాడు. ఏకంగా కుక్కతో 100 కిలోల కేక్‌ కట్ట చేయించి...నాలుగు వేలమందికి భోజనాలు పెట్టాడు. అతను పెట్టించిన భోజనం కూడా మాములుగా లేదు. వచ్చిన వారందరికీ  సుమారు 300 కేజీల మాంసం, 100 డజన్ల గుడ్లతో మంచి విందు ఇచ్చాడు. అంతేకాదు శాఖాహారులకు కూడా వివిధ రకాల రెసిపీలతో ఘనంగా భోజనం ఏర్పాటు చేశాడు.

ఎందుకు చేశాడంటే ఇలా...
శివప్ప 20 ఏళ్లుగా గ్రామ పంచాయితీ సభ్యుడిగా ఉంటున్నాడు. ఐతే కొత్త పంచాయితీ సభ్యుడు బర్త్‌ డే పార్టీకి పిలిపించి అవమానించాడంటా. దీనికి నిరసనగానే తన పెంపుడు కుక్కుకు ఘనంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించాడు శివప్ప.

(చదవండి: ఢిల్లీ గోడౌన్‌లో మంటాలార్పుతున్న 'రోబో': వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు