మోదీ చిత్రం లేకుండా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లు

12 Mar, 2021 02:50 IST|Sakshi

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అమలు

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 టీకా తీసుకున్నవారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రంతో కూడిన వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ అందజేస్తున్నారు. అయితే, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇకపై వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌లో మోదీ చిత్రం ఉండబోదు. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు కో–విన్‌ పోర్టల్‌లో ఈ మేరకు మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లలో ప్రధానమంత్రి చిత్రం ఉండడం పట్ల పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది.

మరిన్ని వార్తలు