విపక్షాల భేటీ వాయిదా!

5 Jun, 2023 06:23 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ వ్యతిరేక పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన కీలక సమావేశం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పాట్నాలో ఈ నెల 12వ తేదీన ఈ భేటీ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రస్తుతం అందుబాటులో లేరు.

ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. దాంతో సమావేశాన్ని వాయిదా వేయాలని జేడీ(యూ) నేతలు నిర్ణయించుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష కూటమి ఏర్పాటుకు బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ యత్నిస్తుండటం తెలిసిందే.

మరిన్ని వార్తలు