పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 4 నుంచి 22 దాకా..

9 Nov, 2023 19:28 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: గందరగోళానికి తెర దించుతూ.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు 2023 నిర్వహణపై స్పష్టమైన ప్రకటన వెలవడింది. డిసెంబర్‌ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో సందేశం ఉంచారు. సెలవులు మినహా డిసెంబర్‌ 22 దాకా.. మొత్తం 15 రోజుల పాటు ఉభయసభలు సమావేశమవుతాయని ఆయన పేర్కొన్నారు.

బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో..  భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను తేనుంది కేంద్రం. వీటిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిన సంగతి తెలిసిందే.

అయితే.. వీటికి సంబంధించిన నివేదికలు ఇటీవల హోం మంత్రిత్వ శాఖకు అందాయి. దీంతో.. శీతాకాల సమావేశాల్లో వీటిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు..  ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు