వాహనదారులకు భారీ షాక్‌.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

22 Mar, 2022 08:35 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్‌ ధరలను చమురు సంస్థలు పెంచాయి. నవంబర్‌ 2 తరువాత పెట్రోల్‌, డీజీల్‌ ధరలను పెంచడం ఇదే తొలిసారి. లీటర్‌ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచారు. కాగా పెరిగిన ధరలు నేటి(మార్చి 22) నుంచే అమల్లోకి రానున్నాయి.

పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
► ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 96.21
►లీటర్‌ డీజిల్‌ రూ. 87.47

►ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 110.78
►లీటర్‌ డీజిల్‌ రూ. 94.94

►హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.10
►డీజిల్‌ లీటర్‌ రూ. 95.49

►విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.110.8
►డీజిల్‌ రూ. 96.83గా ఉంది.

చదవండి: (LPG Gas: వినియోగదారులకు షాక్‌.. భారీగా పెరిగిన వంటగ్యాస్‌ ధర)

>
మరిన్ని వార్తలు