పార్లమెంట్‌పై దాడి..కారణాలు చెప్పిన రాహుల్‌ గాంధీ

16 Dec, 2023 21:20 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో అలజడి ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.ధరల పెరుగుదల, నిరుద్యోగం కారణాల వల్లే పార్లమెంట్‌పై కలర్‌స్మోక్‌ దాడి జరిగిందని తెలిపారు.

‘అసలు పార్లమెంట్‌పై దాడి ఎందుకు ఎజరిగింది. నిరుద్యోగం ఈ దేశంలో పెద్ద సమస్య. ఈ సమస్యతో దేశం అట్టుడుకుతోంది. ప్రధాని మోదీ పాలసీ వల్లే యువతకు ఉద్యోగాలు లేవు’అని శనివారం రాహుల్‌ మీడియాతో వ్యాఖ్యానించారు.

డిసెంబర్‌13న మధ్యాహ్నం నీలం సింగ్‌, అమోల్‌ షిండే అనే ఇద్దరు వ్యక్తులు కలర్‌స్మోక్‌తో లోక్‌సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఎంపీలపైకి దూకిన విషయం తెలిసిందే. దేశంలోని నిరుద్యోగంపై నిరసన తెలిపిందుకే వారి ఈ దాడికి పాల్పడ్డారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.  

ఇదీచదవండి..మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా జీతూ పట్వారీ

>
మరిన్ని వార్తలు