టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

19 Jan, 2021 09:05 IST|Sakshi

బెంగాల్‌లో దీదీ.. తమిళనాడులో డీఎంకేకు పట్టం
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఏబీపీ(ఆనంద బజార్‌ పత్రిక) న్యూస్, సీ ఓటర్‌ సర్వే నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. 2021లో పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సర్వే పూర్తి వివరాలు..

పరిశుభ్రతే లక్ష్యం

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలల్లో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రపద్రేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. టాయిలెట్ల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌)  తయారు చేయాలని సూచించారు. పూర్తి వివరాలు

నేడు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్‌

సీఎం కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి బయలుదేరి 11 గంటలకు కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయానికి సీఎం చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించాక అక్కడి నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పరిధిలో ఏరియల్‌ వ్యూ ద్వారా తిలకిస్తారు. పూర్తి వివరాలు

డిసెంబర్‌లోనే స్కెచ్‌ వేశారు!

హఫీజ్‌పేట భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు తదితరుల్ని కిడ్నాప్‌ చేసేందుకు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌ రామ్‌ డిసెంబర్‌లోనే స్కెచ్‌ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే అనివార్య కారణాలతో ఈ నెల మొదటి వారానికి వాయిదా పడింది. పూర్తి వివరాలు

రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ.. శాంతిభద్రతల అంశం

మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 26న ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ శాంతిభద్రతకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీలోకి ఎవరిని అనుమతించా లన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులేనంది. పూర్తి వివరాలు..


వాషింగ్టన్‌లో హై అలర్ట్‌

అమెరికా రాజధాని వాషింగ్టన్, డీసీ మిలటరీ కేంద్రాన్ని తలపిస్తోంది. దేశ నూతన అధ్యక్షుడిగా జనవరి 20న జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా వాషింగ్టన్‌లో, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో అల్లర్లు చెలరేగే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రత వర్గాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి వివరాలు 


ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

గుజరాత్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూరత్‌లోని కొసాంబ సమీపంలో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందాగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు..

ఇది నీ కథేనా అని అడుగుతున్నారు!

‘ఎఫ్‌సీయూకే’లో నా పాత్ర గురించి వెల్లడైన విషయాలు చూసి, ఇది నీ కథేనా? అని కొందరు అడుగుతున్నారు. పిల్లలకు ఆటలు కావాలి, యూత్‌కు రొమాన్స్‌ కావాలి, మాకు అన్నీ కావాలి. ఈ సినిమాలో అవన్నీ ఉంటాయి. ప్రేక్షకుల్ని ఈ సినిమా అలరిస్తుంది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. పూర్తి వివరాలు..

ఆసక్తికర ఘట్టానికి టెస్టు సిరీస్‌

వరుసగా రెండో పర్యటనలోనూ భారత జట్టు ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయం సాధించగలదా... లేక సిరీస్‌ను సమంగా ముగించి ట్రోఫీని నిలబెట్టుకోగలదా అనేది నేడు తేలనుంది. చివరి టెస్టులో ఆసీస్‌ నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సోమవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. పూర్తి వివరాలు..


బ్యాంకింగ్‌ డిజిటలైజేషన్‌లో బాలారిష్టాలు

భారత్‌ బ్యాంకింగ్‌ డిజిటలైజేషన్‌ పక్రియ మెరుగుపడుతున్నా, ఇంకా పలు అడ్డంకులు ఉన్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ పేర్కొంది. పలు ప్రభుత్వ రంగ, చిన్న ప్రైవేటు రంగ బ్యాంకుల తక్కువ లాభదాయకత, మొండిబకాయిల భారం వంటి అంశాలను ఈ మేరకు విడుదల చేసిన ఒక నివేదికలో ప్రస్తావించింది. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు