ఆర్టికల్‌ 370 రద్దు : ‘సుప్రీం కోర్టు తీర్పు కలవరపరించింది’

16 Dec, 2023 12:47 IST|Sakshi

ముంబై: న్యాయ కోవిదుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింగ్టన్‌ ఫాలీ నారీమన్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. ఇటీవల సుప్రీం కోర్టు ఆర్టికల్‌ 370 రద్దుపై వెలువరించిన తీర్పు, కొలీజియం వ్యవస్థ, ఎలక్షన్‌ కమిషనర్ల నియామకం బిల్లు వంటి అంశాలపై ఆయన శుక్రవారం ఆసియాటిక్‌ సోసైటీ ఆధ్వర్యంలో ‘కాన్‌స్టీట్యూషన్: చెక్‌ అండ్‌ బ్యాలన్సస్‌’ మాట్లాడారు.

ఆర్టికల్‌ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు తనని చాలా కలవెరపెట్టిందని తెలిపారు. ఆర్టికల్‌ రద్దు విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించిందని తెలిపారు. అయితే దానివల్ల రాజ్యాంగ విరుద్ధమైన చర్యను కొనసాగించడానికి అనుమతి ఇచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లు ఇటీవల రాజ్య సభలో ఆమోదం పొందిన విషయం కూడా తనను తీవ్ర కలవరానికి గురి చేసిందని చెప్పారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిపారు. 

జడ్జిలను ఎంపిక చేసే ప్రస్తుత కొలీజియం వ్యవస్థ కూడా దారుణమైనదని కానీ,అది కొంతమేరకు మేలేనని తెలిపారు. రిటైర్డ్‌ న్యాయమూర్తులతో కూడిన కొలీజియంను తాను సూచిస్తానని అ‍న్నారు. అందులో ఉండేవారు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతారని తెలిపారు. ప్రధాని న్యాయమూర్తి, సీనియర్‌ న్యాయమూర్తుల సూచనలు కూడా తీసుకుంటారని అన్నారు. అనంతరం వారు న్యాయమూర్తులను సిఫార్సు చేస్తారని చెప్పారు.

చదవండి: ఆధార్‌పై ప్రశ్నలకు భారీ స్పందన..

>
మరిన్ని వార్తలు