కుప్పకూలిన చార్‌దామ్‌ టన్నెల్‌..చిక్కుకున్న 40 మంది

12 Nov, 2023 12:49 IST|Sakshi

డెహ్రాడూన్‌: నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్‌లో కొంత భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 40 మంది దాకా కార్మికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఈ ఘటన జరిగింది. చార్‌దామ్‌ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా  సిల్క్‌యారా నుంచి దండల్‌గాన్‌ను కలుపుతూ నాలుగు కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మిస్తున్నారు.

ఇవాళ(ఆదివారం)ఉదయం 4 గంటల ప్రాంతంలో టన్నెల్‌లోని 150 మీటర్ల పొడవున్న ఒక భాగం కుప్పకూలినట్లు పోలీసులు చెప్పారు. టన్నెల్‌ కూలిన వెంటనే జిల్లా యంత్రాంగం అక్కడికి చేరుకుంది. టన్నెల్‌ కొంత భాగం ఓపెన్‌ చేసి చిక్కుకున్న 40 మంది కార్మికులను బయటికి తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈలోగా వారికి ఆక్సిజన్‌ అందించేందుకు పైప్‌ను ఏర్పాటు చేశారు.  

ఇదీచదవండి..రాహుల్‌ ఎక్కడ?

    

మరిన్ని వార్తలు