యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బాంబు బెదిరింపులు .. ఇద్దరి అరెస్టు

4 Jan, 2024 08:44 IST|Sakshi

లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, అయోధ్య రామాలయంలపై బాంబు బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బాంబులు వేసి యోగి ఆదిత్యనాథ్‌, అయోధ్యలోని రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో నిందితులు పోస్ట్ చేశారని అధికారులు తెలిపారు. నిందితులను తాహర్ సింగ్, ఓంప్రకాష్ మిశ్రాలుగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్‌) బృందం  గుర్తించింది. నిందితులు లక్నోలో విభూతి ఖండ్ ప్రాంతానికి చెందినవారని వెల్లడించారు. 

ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యాష్, అయోధ్యలోని రామమందిరాన్ని పేల్చేస్తామని బెదిరించారని పోలీసులు గుర్తించారు. బెదిరింపు పోస్టుల్లో నిందితులకు సంబంధించిన ఈమెయిల్ ఐడీలు  ఉన్నట్లు తేలింది. ఈమెయిల్‌ ఐడీల సాంకేతిక విశ్లేషణ తర్వాత తాహర్‌ సింగ్‌ ఈమెయిల్‌ ఖాతాలను సృష్టించారని, ఓంప్రకాశ్‌ మిశ్రా బెదిరింపు సందేశాలు పంపారని తేలింది.

నిందితులు ఇద్దరూ గోండా నివాసితులు. పారామెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసును ఎస్టీఎఫ్ మరింత లోతుగా విచారిస్తోంది. నిందితులే ఈ చర్యకు పాల్పడ్డారా? లేక దీని వెనక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 

ఇదీ చదవండి: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్? ఆప్‌ నేతలు అలర్ట్!


 

>
మరిన్ని వార్తలు