కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

26 Feb, 2022 06:08 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు హతమయ్యారు. మరో సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు వెల్లడించారు అమిషిపొరా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న కచ్చితమైన సమాచారం మేరకు జరిగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదుల్ని నిర్బంధించడానికి ప్రయత్నించగా వారు జరిపిన కాల్పుల్లో షకీల్‌ అహ్మద్‌ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని, ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని పోలీసులు తెలిపారు.  గురువారం రాత్రంతా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టుగా  వివరించారు. 

మరిన్ని వార్తలు