ASI Report On Gyanvapi: జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో పూజలు చేసుకోండి

1 Feb, 2024 05:09 IST|Sakshi

పూజల బాధ్యత కాశీ విశ్వనాథ్‌ ట్రస్ట్‌దే

జిల్లా మేజి్రస్టేట్‌ను ఆదేశించిన వారణాసి జిల్లా కోర్టు

వారణాసి: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసు బుధవారం అత్యంత కీలక మలుపు తీసుకుంది. మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ చేసిన శాస్త్రీయ సర్వే నివేదిక ప్రకారం మసీదు కింద ఒకప్పుడు ఆలయం ఉండేదని బయటపడిన నేపథ్యంలో హిందువుల అనుకూలంగా వారణాసి కోర్టు నుంచి తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.

మసీదు సెల్లార్‌లోని హిందూ దేవతలను ఆరాధించేందుకు, పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు ఒక పూజారికి అనుమతినిస్తూ వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులిచి్చంది. మసీదు ప్రాంగణంపై యాజమాన్య హక్కుల కేసులో పిటిషనర్‌ అయిన శైలేంద్ర కుమార్‌ పాఠక్‌కు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని ఆయన తరఫు న్యాయవాది మదన్‌ మోహన్‌ యాదవ్‌ చెప్పారు.

‘‘ ఏడు రోజుల్లోగా ఆ మసీదు సెల్లార్‌లో పూజకు అనువుగా ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఏకే విశ్వేశ ఆదేశించారని లాయర్‌ మదన్‌ వెల్లడించారు.

ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాశీ విశ్వనాథ్‌ ట్రస్టుకు ఈ పూజల బాధ్యతలు అప్పగించింది. పిటిషనర్‌ శైలేంద్ర తాత,పూజారి సోమ్‌నాథ్‌ వ్యాస్‌ గతంలో ఈ సెల్లార్‌లోనే 1993 డిసెంబర్‌దాకా పూజలు చేసేవారు. ఆ క్రమంలోనే ఇక్కడ పూజలు చేసుకునే హక్కులు తమకు దక్కుతాయంటూ ఆయన కోర్టు ఆశ్రయించారు. మసీదులో  చిన్న కొలను వజూఖానా ముందున్న నంది విగ్రహం వద్ద ∙బ్యారీకేడ్లను తొలగించాలని, పూజలకు మార్గంసుగమం చేయాలని జడ్జి ఆదేశించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు