Viral Video: హోలీ రాకుండానే యువకుల హంగామా!

20 Mar, 2024 14:13 IST|Sakshi

రంగుల పండుగ హోలీ మరికొద్ది రోజుల్లో రానుంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే హోలీ రాకుండానే కొందరు యువకులు రోడ్డుపై వెళ్తున్న వారిపై వాటర్‌ బెలూన్లు విసురుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆ యువకుల చేష్టలకు బలైనవారితో పాటు ఈ వీడియో చూసిన వారంతా ఆ కుర్రాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటివారిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ​ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు నీరు నింపిన కొన్ని బెలూన్లను పట్టుకున్నట్లు కనిపిస్తుంది. కారులో వెళుతున్నవారు సన్‌రూఫ్ నుండి ఆ బెలూన్లను రోడ్డుపై వెళుతున్న వారిపైకి విసరడం వీడియోలో కనిపిస్తుంది.

కాగా అదే రోడ్డుపై ఆ కారును వెంబడిస్తున్న మరో కారులోని వ్యక్తి ఈ ఉదంతాన్ని ఈ వీడియో తీసి,  సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్)లో @gharkekalesh అనే పేజీలో షేర్‌ అ‍య్యింది. ఈ వీడియోను ఇ‍ప్పటి వరకూ  9 లక్షల 94 వేల మంది  వీక్షించారు. ఈ వీడియోను చూసిన  ఒక యూజర్‌ ‘ఇలా చేయడం తప్పు. వీరిపై చర్య తీసుకోవాలి’ అని రాశారు. మరొక యూజర్‌ ‘ఆ కారు నంబర్‌ను చూసి, పోలీసులకు ట్యాగ్ చేయాలి’ అని కోరాడు.  
 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers