-

'కారు పార్టీ' స్టీరింగ్‌ ఓవైసీల చేతుల్లోనే.. : రాజా సింగ్‌

27 Nov, 2023 09:20 IST|Sakshi
ర్యాలీలో రాజాసింగ్‌, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, నగరంలోని గోల్‌హన్మాన్‌ వద్ద కార్నర్‌ మీటింగ్‌కు హాజరైన ప్రజలు

హామీలు అమలు కాక ప్రజలు నమ్మట్లేదు!

నిజామాబాద్‌లో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రోడ్‌ షో..

నగరంలో భారీ బైక్‌ ర్యాలీ!

సాక్షి, నిజామాబాద్‌/హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలో ఓవైసీలు టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ పాతబస్తీని మినీ పాకిస్థాన్‌గా మార్చారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నిజామాబాద్‌ అర్బన్‌ బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా తరఫున రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు దుబ్బ చౌరస్తా నుంచి గంజ్‌ కమాన్‌, రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, దేవీరోడ్‌, పూసలగల్లి మీదుగా గోల్‌ హనుమాన్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం గోల్‌ హనుమాన్‌ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ అర్బన్‌లో సూర్య నారాయణను గెలిపించుకుంటే కేంద్రం, రాష్ట్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొస్తాడని తెలిపారు. గణేశ్‌ గుప్తా కమీషన్లు తీసుకుంటాడని ఆరోపించారు. దేశంలో ఉగ్ర కార్యకలాపాలు ఎక్కడ జరిగినా వాటి మూలాలు, అరెస్టులు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయన్నారు.

రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా హైదరాబాద్‌లో అల్లర్లు కాకుండా ఓవైసీ కాళ్లు పట్టుకుంటున్నారని, వాళ్లని అడుక్కునే అవసరమేముందని ప్రశ్నించారు. ఇటీవల మధ్యప్రదేశ్‌ నుంచి ఎన్‌ఐఏ అధికారులు వచ్చి ఆరుగురు టెర్రరిస్టులను పట్టుకున్నారని, అందులో ఒకరు ఓవైసీకి చెందిన కళాశాల ప్రొఫెసర్‌ అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఒక టెర్రరిస్టు ఏం పాఠాలు చెబుతాడని, కేవ లం టెర్రరిజం నూరిపోస్తున్నారని విమర్శించారు.

బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రవాదులకు మద్దతు తెలిపితే బుల్డోజర్లు వస్తాయన్నారు. హైదరాబాద్‌ తర్వాత ఎంఐఎం లక్ష్యం నిజామాబాద్‌ అని, ఇందూరు ప్రజలు ఆలోచించి ఓటే యాలన్నారు. కారు పార్టీ స్టీరింగ్‌ ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ను కాస్త బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చారన్నారు. మైనారిటీ మహిళల ఆత్మగౌరవం కోసం పీఎం నరేంద్రమోదీ ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేయించారన్నారు.

నగరాభివృద్ధి ఎక్కడ..?
సీఎం కేసీఆర్‌ పెద్ద మోసగాడని, 2014లో దళితుడి ని సీఎం చేస్తానని చెప్పి చేయలేదన్నారు. గణేశ్‌ గు ప్తా అర్బన్‌ను రూ.1500 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్తున్నాడని, ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పాలని డి మాండ్‌ చేశారు. కవిత లిక్కర్‌ స్కాంలో ఇరుక్కుందన్నారు. బీసీని సీఎం చేస్తానని ప్రకటించిందని బీజే పీ మాట నిలబెట్టుకుంటుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, జిల్లా ఇన్‌ఛార్జి క ళ్లెం బాల్‌రెడ్డి, నాయకులు, కార్పొరేటర్లు న్యాలం రా జు, స్రవంతిరెడ్డి, పంచరెడ్డి లింగం, వనిత, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శివప్రసాద్‌ తదితరులున్నారు.

నేను గెలిస్తే హిందువులు గెలిచినట్లే..
అర్బన్‌లో తాను గెలిస్తే హిందువులందరూ గెలిచినట్లేనని బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్య నారాయణ పేర్కొన్నారు. ఓవైసీ 15 నిమిషాలు సమయమిస్తే హిందువులు లేకుండా చేస్తానని గతంలో ప్రసంగించారని గుర్తుచేశారు. దమ్ముంటే అర్బన్‌లో బీఆర్‌ఎస్‌ తరపున ప్రచారం చేయాల ని సవాల్‌ విసిరానని, భయపడి రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీకి హిందూ వ్యతిరేక శక్తులతో సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక వర్గం కోసం పని చేస్తున్నాయన్నారు.
ఇవి చదవండి: ఓటుకు వారు దూరమే..

మరిన్ని వార్తలు