తప్పిపోయి రెండేళ్లు దాటింది! ప్రస్తుతం..

17 Dec, 2023 10:10 IST|Sakshi
బాలిక శ్వేత

కామారెడ్డి బాలరక్ష భవన్‌లో

దోమకొండ బాలిక శ్వేత

నిజామాబాద్‌: రెండేళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరువు ప్రాంతంలోని ఇస్నాపూర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఓ బాలికను వదిలి వెళ్లాడు. రోదిస్తున్న బాలికను చూసి స్థానికులు సమాచారం అందించగా పోలీసులు సదరు బాలికను అమీన్పూర్‌లోని మహిమ మినిస్ట్రీలో చేర్పించారు. బాలికను విచారించగా తన పేరు శ్వేత అలియాస్‌ రేణుక అని తన తల్లిదండ్రుల పేర్లు సంధ్య, ప్రభాకర్‌రెడ్డి అని, తమది దోమకొండ గ్రామం అని చెప్పింది.

అంతే కాకుండా తన అక్క పేరు సరిత, బావ పేరు వెంకటరెడ్డి, వారు కామారెడ్డిలో ఉంటారని పోలీసులతో చెప్పింది. రెండేళ్లుగా అక్కడే ఉన్న సదరు బాలికను అధికారులు రెండు నెలల క్రితం కామారెడ్డి బాలరక్ష భవన్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఆమె ఇక్కడే ఆశ్రయం పొందుతున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ బావయ్య, జిల్లా బాలల సంరక్షణ అధికారిణి స్రవంతి తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ప్రియా థియేటర్‌ రోడ్డులో ఉన్న బాల రక్ష భవన్‌కు వచ్చి సంప్రదించాలని కోరారు.
ఇవి చ‌ద‌వండి: ఉద్యోగం రావడంలేదని యువకుడి బలవన్మరణం

>
మరిన్ని వార్తలు