అమెరికాలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్‌ గ్రీట్‌ గ్రాండ్‌ సక్సెస్‌

10 May, 2023 19:45 IST|Sakshi

అమెరికా రాజధాని వాషింగ్టన్  డీసీలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత,  ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్‌  గ్రీట్ విజయవంత మైంది. అమెరికాలో వైయస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు బాణాసంచాతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి స్వాగతం పలికారు. మే 07న హొటల్‌ పారడైస్ ఇండియన్ కుసిన్ లో నిర్వహించిన ఈ సభలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు 275 మందికి పైగా పాల్గొన్నారు.

తొలుత దివంగత నేత, తెలుగు ప్రజల స్ఫూర్తి ప్రదాత, మహానేత రాజశేఖర రెడ్డికి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి వల్లూరు, వెంకట్ రెడ్డి కల్లూరి, పార్థ బైరెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన, పుష్ప గుచ్చాలతో అంజలి ఘటించారు. వివిధ జాతీయ తెలుగు సంఘాల ప్రతినిధులు - రిపబ్లిక్ పార్టీ లీడర్ వర్జీనియా ఆసియన్ అడ్విసోరీ బోర్డు మెంబెర్ శ్రీమతి శ్రీలేఖ పల్లె, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెట) నుంచి శ్రీమతి శైలజ, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట) నుంచి శ్రీ సతీష్ రెడ్డి నరాల, కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (కాట్స్) నుంచి శ్రీ అనిల్ రెడ్డి నందికొండ, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) నుంచి సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, ఇతర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైస్సార్సీపీ మిడ్ అట్లాంటిక్ ఇంచార్జి పార్థ బైరెడ్డి ముఖ్య అతిధులను వేదికకు ఆహ్వానించారు. రమేష్ రెడ్డి వల్లూరు, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అమెరికా అడ్వైసర్ అండ్‌  గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ (ఈవెంట్ ఆర్గనైజర్) వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను దిగ్విజయంగా నడిపారు. మేరీల్యాండ్ స్టేట్ 10th డిస్ట్రిక్ట్ సెనెటర్ బెంజమిన్ బ్రూక్స్ మరియు అతని ప్రతినిధి కెన్నీ బ్రౌన్ తమ రాష్ట్రానికి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాకను సాదరముగా ఆహ్వానించారు. వర్జీనియా డెమొక్రాట్ లీడర్ శ్రీ శ్రీధర్ నాగిరెడ్డి.. మంత్రిని వాషింగ్టన్ డల్లాస్ ఎయిర్ పోర్ట్ లో సాదరముగా అమెరికా రాకను ఆహ్వానించారు. స్థానిక YSRCP సభ్యులు ప్రసంగిస్తూ.. శ్రీ రాజశేఖర రెడ్డి ఆశయాలను, ప్రవేశపెట్టిన పధకాలను కొనియాడుతూ, ప్రస్తుత ముఖ్య మంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పని తీరు తెన్నులను మనస్ఫూర్తిగా పొగిడారు. 

శివ రెడ్డి మాట్లాడుతూ ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో గ్రామ, వార్డు సచివాలయం. ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ వ్యవస్థ, ఎవరికీ ఏ సమస్య వచ్చినా చెయ్యి పట్టుకొని నడిపించే పరిస్థితి. ఏకంగా లబ్ధిదారుల జాబితాను సోషల్‌ ఆడిట్‌ కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం, లంచాలకు లేకుండా, వివక్షకు తావులేకుండా ఇవ్వగలిగే గొప్ప వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకు రావడం చాల గొప్ప విషయమన్నారు. 

రమేష్ రెడ్డి ప్రసంగిస్తూ తరాలు మారినా రాజశేఖరుడిలాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కానరారని ,కులమత ప్రాంతాలకు అతీతంగా అజన్మాంతం సామాన్యుడి మదిలో నిలిచిపోయారని ,అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడుగా ఆశయ సాధనలో ధీరుడిగా "రాజన్న సువర్ణ రాజ్యం" కొరకు గత నాలుగు సంవత్సరాలుగా అహర్నిశలు పాటుపడుతూ ప్రతి పక్షం గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్న వై యస్ జగన్ రాష్టానికి మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చే 2024 ఎన్నికల్లో గెలుపొందేవిధంగా నవతరం పాటుపడాలన్నారు. దివంగత నేత రాజశేఖరుడి తనయుడు పెద్దాయన ఏర్పరచిన దారిలో నడుస్తున్న నేటి తరం జన నేత జగన్ కి మన సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మాట నిలబెట్టుకుంటూ, ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల‌ను నాలుగేళ్ల ప‌రిపాల‌న‌లో 98 శాతానికి పైగా నెరవేర్చిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ ప్ర‌జా మ‌ద్ద‌తు నిలువెత్తు నిదర్శనమన్నారు. గత 48 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా చేస్తున్న మేలును ఇంటింటా వివరించి.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం మంచి పరిమాణం అన్నారు. 

జార్జ్ ఉపన్యసిస్తూ మారిన కాలానికి అనుగుణంగా మన దేశ ఆర్థిక పరిస్థితులు మారాలని,యువతరం ముందుకు రావాలని,ఇపుడున్న ప్రభుత్వం ఎలా సామాన్య ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నారో అందరూ చూస్తున్నారని సెలవిచ్చారు. అలాగే నిన్నటి రాజన్న పరిపాలనలో కాంచిన పేదవారి చిరునవ్వులు నేడు మల్లీ జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి రధ సారధిగా వచ్చి వీరభూస్తున్నారని పునరుధ్ఘాటించారు. నేటి ఆర్ధిక మంత్రి బుగ్గన, సీఎం జగన్‌ మధ్య సఖ్యత నాటి ఆర్ధిక మంత్రి కొణజేటి రోశయ్య, ,డాక్టర్ వైఎస్ సఖ్యతను తలపిస్తున్నారని పొగిడారు. అనంతరం సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల మాట్లాడుతూ NRI YSRCP అంతా ఒక్కటై ఒకేమాటగా ఒకే బాటగా YSRCP పార్టీని 2024 లో తిరిగి అధికారంలోకి తీసుకురావాలని అందుకు అందరి సహాయ సహకారాలు చాలా అవసరమని పేర్కొన్నారు. గోరంట్ల వాసు బాబు విద్య యెక్క ఆవశ్యకతను తెలియచేస్తూ తాను ఎలా పేద విద్యార్థులకు భోధనాభ్యసన పరికరములు, భోధన సామాగ్రి సాయం చేస్తున్నారో తెలిపారు.

ఈ సభలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి  బుగ్గన మాట్లాడుతూ ఏపీ రాష్ట్రం పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుందన్నారు. ప్ర‌జా సంక్షేమ‌మే ఊపిరిగా ప్ర‌జ‌ల మ‌న‌స్సులో నిలిచిన నేత వైఎస్సార్‌ అని, దివంగ‌త మ‌హానేత అమ‌లు చేసిన ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల రూపంలో ఆయ‌న ఇప్ప‌టికీ మ‌నంద‌రి గుండెల్లో నిలిచి ఉన్నారని చెప్పారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిలో ఏపీ దూసుకుపోతోంది. పెద్ద ఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, రెవిన్యూ జనరేషన్, యువతకు ఉపాధి, స్కిల్‌ విషయాలు ఏవీ పచ్చమీడియా పట్టించు కోదు. 192 స్కిల్‌ హబ్‌ల ద్వారా పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తున్నాం. 95 వేల మందికి శిక్షణ ఇస్తే వారిలో 85 శాతం మందికి ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి. మంత్రి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి విద్య ఒక్కటే ...రాష్ట్రంలో పేదల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే సరైన మార్గం అని నమ్మి రాష్ట్రంలో ప్రతి విధ్యార్ధి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జ‌గ‌న్ గారు విద్య ,ఉద్యోగం పై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

అమెరికాలో ఉండే ప్రవాసాంధ్రులందరినీ సంఘటితపరచి వచ్చే ఎన్నికలలలో మన పార్టీని బలోపేతం చేయాలనీ, పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన.. జనాదరణను సోషల్ మీడియా ద్వారా తెలియచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మేం ఏది చెప్పినా ప్రజలు నమ్ముతున్నారనుకుంటున్నారు. అందుకే చెప్పిన అబద్ధాన్నే పది సార్లు చెబుదాం అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా బతుకుతోందని దుయ్యబట్టారు.

 కొంతకాలంగా రాష్ట్రంలోని ప్రగతి, రాష్ట్రానికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా త‌ప్పుడు వార్త‌లు రాస్తున్నాయ‌ని, వారి రాతలు రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలనే ప్రయత్నంలా కనిపిస్తోంద‌ని అన్నారు. వారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తిరిగి 2024 లో రాజన్న రాజ్యం తథ్యం అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం ప్రతిష్టను పెంచి గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయగల నాయకుడు జన నేత శ్రీ వైయస్‌ జగన్‌ ఒక్కరే అని వారు ధీమాగా పేర్కొన్నారు. తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే ‘వైనాట్‌ 175’ అంటున్నామని అన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోన సాగిస్తూ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ నవరత్నాలు రూపంలో చేస్తున్న సుపరిపాలన భేషుగా ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు అన్నారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ అడుగుజాడల్లోనే నడుస్తూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేయడాన్ని భారత దేశం మొత్తం ఒక కొలమానం గ చూడడాన్ని చాల గొప్పగా ఉందని ప్రసంశించారు.

రానున్న 2024 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని, మళ్ళి శ్రీ జగన్‌ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న ధీమాను వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్, వర్జీనియా, న్యూ జెర్సీ, డెలావేర్, నార్త్ కరోలినా రాష్ట్రముల వైస్సార్ కాంగ్రెస్‌ పార్టీ కోర్ కమిటి సభ్యులు, ఇతర ప్రాంతాల నుండి అనేకులు పాల్గొన్నారు. రామ్ (RAAM) నాయకులు న్యూజెర్సీ నుంచి రామ్మోహన్ రెడ్డి ఎల్లంపల్లి , వర్జీనియా నుంచి శ్రీధర్ నాగిరెడ్డి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. కళ్యాణి ,  శ్రీధర్ వన్నెంరెడ్డి తమ హొటల్‌ పారడైస్ ఇండియన్ కుసిన్ లో అందరికి పసందైన విందు భోజనంతో  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆత్మీయ సమ్మెళనా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. చివరగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రమేష్ రెడ్డి  విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు