డాలస్‌లో బాపూజీ 153 వ జయంతి సంబరాలు

6 Oct, 2022 12:02 IST|Sakshi

డాలస్‌లో అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారకస్థలి మహాత్మాగాంధీజీ 153వ  జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  మహాత్మా గంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

సంస్థ కార్యదర్శి  రావు కలవల స్వాగతోపన్యాసం చేయగా, నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు ఉర్మాట్ సింగ్ మాట్లాడుతూ ఈ ఏడాది గాంధీ జయంతి వేడుకలలో  ఎప్పటిలాగానే  “గాంధీ శాంతి నడక” కొనసాగించడం ఆనందంగా ఉన్నారు. అలాగే అంతర్జాతీయ అహింసా దినంగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించడం అంటే విశ్వమానవాళి శాంతి కాముకుడైన గాంధీజీకి ఘన  నివాళి అర్పించడమేనని ఎంజీఎంఎన్టీ అధ్యక్షులు డా. ప్రసాద్‌  తోటకూర   కొనియాడారు.

ఈ వేడుకలకు ప్రత్యేక అతిధిగా  ఇర్వింగ్‌ నగర్‌  కౌన్సిల్‌  సభ్యుడు మార్క్‌ జేస్కిను,  పోలీస్ చీఫ్ డెరెక్ మిలార్త ను డా. తోటకూర సభకు పరిచయం చేశారు. ప్రవాస భారతీయులు ఇర్వింగ్‌ నగర అభివృదికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. బోర్డు సభ్యులు  తెల్ల పావురాలను ఎగురవేశారు. అనంతరం పోలీస్ చీఫ్  శాంతి వాక్‌ను ప్రారంభించారు. పిల్లలు, పెద్దలు స్త్రీలు ఉత్సాహంగా పాల్గొని బాపూజీకి పుష్పాంజలి ఘటించారు. ప్రసాద్‌ తోటకూరతోపాటు, రావు కలవల, ఉర్మాట్ జునేజా, సల్మాన్‌ ఫర్హోరి, ఇందు మందాడి , తైయాబ్ కుండవాలా, ప్పయూష్ పటేల్, షబ్నం,  మొద్గిల్‌,రాజీవ్ ,శైలేష్ , చంద్రిక, హేతల్‌ సా, సాంటే చారి, పులిగండ్ల విశ్వనాధం, సత్యన్ కల్యాణ్‌ తదితరులు ఈ  వేడుకల్లో  పాల్గొన్నారు.

అక్టోబర్‌ 2 సాయంత్రం  ఇర్వింగ్‌  ఆర్ట్స్‌ సెంటర్‌లో జరిగిన  సాంస్కృతిక  కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా కాన్సల్‌ జనరల్ ఆఫ్ ఇండియా అసీం మహాజన్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో  భాగంగా బాపూజీ 153 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బాపూజీ సిద్ధాంతాలు సర్వత్రా ఆచరణీయమన్నారు.  అతిపెద్ద గాంధీ స్మారక స్థలిని ఎన్‌ఆర్‌ఐలు ఏర్పాటు చేయడం తమకు గర్వకారణమని ప్రత్యేక అతిధిగా  హాజరైన నగర మేయర్‌ రిక్‌ స్తోఫెర్‌ కొనియాడారు. అక్టోబరు 2ను “గాంధీ డే” గా ప్రకటిస్తూ ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. ఈ పత్రాన్ని సంస్థ అధ్యక్షుడు, ఇతర సభ్యులకు అందించారు. దాదాపు 250 మందికి పైగ చిన్నారు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రేడియో సురభి సభ్యులు రాజేశ్వరి ఉదయగిరి, రవి తూపురాని, అంబా లక్ష్మి, స్ఫూరిత మలవరపు, మైత్రేయి మియాపురం, వేణు చెరుకుపల్లి, శివ దేశిరాజుల ఆధ్వర్యంగా ఘనంగా నిర్వహించారు.  చివరగా  సురభి రేడియో తోపాటు,  ఈ కార్యక్రమ నిర్వాహకులు, వివిధ సంస్థలు,  చిన్నారులు ,అతిధులకు ఐఏఎన్టీ బోర్డు ఛైర్మన్‌ సల్మాన్‌ ఫర్హోరి  కృత్జజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు