ఆస్పత్రి బిల్లు రూ.3.40 కోట్లు.. ఆదుకున్న అధికారులు

17 Sep, 2021 19:10 IST|Sakshi

దుబాయ్‌లో కార్మికుడికి అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి

దుబాయ్‌: అనారోగ్యం కారణంగా దుబాయ్‌ ఆస్పత్రిలో చేరిన గల్ఫ్ కార్మికుడికి అండగా నిలిచింది గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపెల్లి గ్రామానికి చెందిన కట్ల గంగారెడ్డి అనే కార్మికుడు గతేడాది డిసెంబర్‌  25న అనారోగ్యం కారణంగా దుబాయ్‌లోని మెడిక్లినిక్‌ హాస్పిటల్‌లో చేరాడు. అప్పటికే పక్షవాతం రావడంతో బ్రెయిన్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టగా పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లాడు. గత ఆరు నెలల తర్వాత గంగారెడ్డి కోమా నుంచి బయటకు వచ్చాడు,. అనంతరం మరో మూడు నెలల పాటు చికిత్స కొనసాగింది. అయితే ఈ 9 నెలలకు సంబంధించి చికిత్స బిల్లు రూ. 3.40 కోట్లు అయ్యింది. 

స్పందించిన అధికారులు
తల తాకట్టు పెట్టినా చెల్లించలేనంతగా ఆస్పత్రి  బిల్లు రావడంతో గంగారెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితిని సంప్రదించారు. సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింహా పేషెంటుకు ధైర్యం చెప్పడంతో పాటు దుబాయ్‌లో ఉన్న ఇండియన్‌ కాన్సులేట్‌ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. దీనికి స్పందించిన భారతీయ అధికారులు బిల్లు మాఫీ చేయించడంతో పాటు గంగారెడ్డి ఇండియా చేరుకునేందుకు ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్సుని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌కి చేరుకున్న గంగారెడ్డిని నేరుగా స్వగ్రామానికి పంపకుండా ప్రస్తుతం నిమ్స్‌ ఆస్పత్రిలో పరిశీలనలో ఉంచారు. 

చదవండి: యూఏఈకి వెళ్లే వారికి ఊరట

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు