డా.పద్మజా రెడ్డిని సత్కరించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)

11 Aug, 2022 18:08 IST|Sakshi

నాలుగు దశాబ్దాలుగా కూచిపూడి సాంప్రదాయ నృత్యంతో కాకతీయ సాంప్రదాయ వారసత్వ కీర్తిని బావి తరాలకు అందించేందుకు ఎంత గానో కృషి చేస్తున్నారు పద్మశ్రీ గ్రహీత డా. పద్మజా రెడ్డి గడ్డం. ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ తరపున శాలువాతో ఆమెను సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

అనంతరం పద్మజా రెడ్డి మాట్లాడుతూ.. తనను సత్కరించిన సొసైటీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని భావి తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న  తెలంగాణ కల్చరల్ సొసైటీ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సన్మాన సభలో సొసైటీ తరపున అధ్యక్షులు నీలం మహేందర్, కోశాధికారి లక్ష్మణ్ రాజు కల్వ, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శులు, జూలూరి సంతోష్, కార్యవర్గ సభ్యులు కాసర్ల శ్రీనివాస రావు, రవి క్రిష్ణ విజ్జాపూర్, శశి ధర్ రెడ్డి, భాస్కర్ నడికట్ల ప్రాంతీయ కార్యదర్శి నంగునూరి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు