అమెరికాలో వైద్య విద్యార్థిని మృతి

14 Nov, 2023 10:07 IST|Sakshi

మహబూబాబాద్: అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్యవిద్యార్థిని మృతి చెందగా ఆదివారం సీరోలు మండలం కాంపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వడ్డేపల్లి పుల్లయ్య కుమార్తె నీరజ(28) ఖ మ్మం జిల్లా కేంద్రంలోని మమత మెడికల్‌ కాలేజీలో బీడీఎస్‌ పూర్తి చేసింది. అమెరికాలోని మెస్సోరీ రా ష్ట్రంలోని లూయిస్‌ యూనివర్సిటీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఈ క్రమంలో గత నెల 28వ తేదీన మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కాగా శనివారం రాత్రి ఆమెరికా నుంచి మృతదేహం వరంగల్‌కు చేరుకోగా ఆదివారం స్వ గ్రామానికి తీసుకొచ్చారు. ఉన్నత విద్యకోసం వెళ్లిన నీరజ విగతజీవిగా స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

జిల్లేడు చెట్టుకు వివాహం జరిపించి అంత్యక్రియలు జరిపించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత కాంపల్లికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి: కళ్లెదుటే ఇద్దరు కుమారులు దుర్మరణం.. కోమాలోకి వెళ్లిన తల్లి

మరిన్ని వార్తలు