‘సింగపూరు పాఠశాలలో తెలుగుని మాతృభాషా మాధ్యమంగా ప్రవేశపెట్టాలి’

20 Oct, 2022 21:16 IST|Sakshi

సింగపూరు పాఠశాలలో తెలుగుని మాతృభాషా మాధ్యమంగా ప్రవేశపెట్టేలా శ్రీ సాంస్కృతిక కళా సారధి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం తరుపు నుంచి సింగపూరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చెయ్యాలని కోరుతూ శ్రీ సాంస్కృతిక కళా సారధి వారి విజయోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి అభ్యర్ధన పత్రం అందించారు.

సింగపూరు నందు దాదాపు 2 శాతం తెలుగు ప్రజలు నివశిస్తున్నారు. తెలుగుని మాతృ భాషలలో ఒకటిగా గుర్తించడం కొన్ని వేల తెలుగు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో శ్రీ సాంస్కృతిక కళా సారధి, కాకతీయ సాంస్కృతిక పరివారము, తెలుగుదేశం ఫోరం ఆఫ్ సింగపూరు సంస్థల ప్రతినిధులు కవుటూరి రత్న కుమార్, జొన్నాదుల సుధాకర్, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, దామచర్ల అశోక్ కుమార్లు తెలియజేశారు. తెలుగును భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దానికి అవసరమైన సాయం తనవైపు నుంచి అందిస్తానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు