-

పవన విద్యుత్‌పై సెంబర్‌కార్ప్‌ పెట్టుబడులు

28 Nov, 2023 01:28 IST|Sakshi

428 మెగావాట్ల ఆస్తుల కొనుగోలు

న్యూఢిల్లీ: సింగపూర్‌కు చెందిన సెంబర్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ భారత్‌తోపాటు చైనాలో 428 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుత్‌ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఇందుకోసం రూ.1,247 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనుంది. సెంబ్‌కార్ప్‌ భారత్‌లో 18 రాష్ట్రాల్లో కార్యకలాపాలు కలిగి ఉంది. తాజా కొనుగోలుతో సంస్థ నిర్వహణలోని పునరుత్పాదక ఇంధన ఆస్తులు 3.7 గిగావాట్ల సామర్థ్యానికి చేరాయి. ఇందులో 2.25 గిగావాట్ల పవనవిద్యుత్, 1.45 గిగావాట్ల సోలార్‌ ఆస్తులు ఉన్నాయి.

లీప్‌ గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన 228 మెగావాట్ల పవన విద్యుత్‌ ఆస్తులను 70 మిలియన్‌ సింగపూర్‌ డాలర్లకు, క్వింజు యూనెంగ్‌కు చెందిన 200 మెగావాట్ల ఆస్తులను 130 సింగపూర్‌ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్టు సెంబర్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా ప్రకటించింది. దీంతో లీప్‌ గ్రీన్‌ ఎనర్జీకి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో ఉన్న 228 మెగావాట్ల పవన విద్యుత్‌ ఆస్తులు సెంబర్‌ కార్ప్‌ సొంతం కానున్నా యి. భారత్‌లో వెక్టార్‌ గ్రీన్‌కు చెందిన 583 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఆస్తులను సైతం గతే డాది ఈ సంస్థ కొనుగోలు చేయడం గమనార్హం.  

మరిన్ని వార్తలు